హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేసారు. కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. 150 డివిజన్లకు 30 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm