హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బీర్కూర్ శివారులోని మంజీరా వారధికి వెళ్లే ప్రధాన రహదారిపై ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు బిచుకుంద మండలం గోపాన్ పల్లి గ్రామానికి చెందిన రమేష్గా పోలీసులు గుర్తించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అతడిని నిజమాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm