హైదరాబాద్: వరుణ్ ధావన్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. చండీగఢ్‌లో షూటింగ్‌లో ఉండగా వీరికి సోకినట్టు సమాచారం. అయితే కరోనా నిర్ధారిత పరీక్షల్లో సీనియర్ హీరో అనిల్ కపూర్‌కు నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో షూట్ ఆగిపోయిందని ఫిలింఫేర్ ఒక నివేదికలో పేర్కొంది. వరుణ్, నీతు, దర్శకుడు రాజ్ కోలుకునేంతవరకు గత నెలలో ప్రారంభమైన షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలిపింది. వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో మూవీ. అయితే సినిమా ముచ్చట్లను ఎప్పటికపుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న చిత్రయూనిట్‌గానీ, నీతూ, వరుణ్, అనిల్ కపూర్‌గానీ ఈ వార్తలపై ఇంకా స్పందించ లేదు.
Mon Jan 19, 2015 06:51 pm