హైదరాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇంచార్జ్‌లుగా ఉన్న చోట టీఆర్ఎస్ ఓటమి పాలు కావడం టీఆర్ఎస్కు సాక్చింది. ఎమ్మెల్సీ కవిత ఇన్‌చార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముఠా పద్మా నరేష్.. బీజేపీ అభ్యర్థి పావని చేతిలో ఓటమి పాలు పాలయ్యారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న అడిక్‌మెట్‌లో, మంత్రి సబిత ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్కే పురంలో టీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నట్లు తీవ్రంగా చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఆమె ఇంచార్జ్‌గా ఉన్న స్థానం నుంచి కార్పొరేటర్ అభ్యర్థి ఓడిపోవడం అధికార పార్టీకి మింగుడు పడని విషయమని చెప్పక తప్పదు.
Mon Jan 19, 2015 06:51 pm