కోల్‌కతా: కోల్‌కతాలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చేయడం కోసం కొత్త నిబంధన తీసుకురానున్నారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు మాత్రమే పెట్రోల్ పోసేలా కొత్త నిబంధన విధించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈనెల 8 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో నో హెల్మెట్.. నో ఫ్యూయల్ అనే కొత్త నిబంధనను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm