హైదరాబాద్: దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ‌్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు లీగల్ నోటీసు పంపించారు. ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ఈ మేరకు ఆమెకు నోటీసులు పంపారు. రైతులతో కలిసి ధర్నా చేస్తున్న ఓ రైతు తల్లిపై కంగనా నోరు పారేసుకుంది. ఇలాంటి వాళ్లు రూ.100కు దొరుకుతారని ఆమె ట్వీట్ చేసింది. రైతులను జాతి వ్యతిరేకులుగా ఆమె చిత్రీకరిస్తోందని డీఎస్‌జీఎంసీ ఆరోపించింది. కంగనా చేసిన ట్వీట్లు రైతులను అవమానించేలా ఉన్నాయని, వెంటనే బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm