న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్‌మాల్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నీడలా వెంటాడుతున్నది. ఫ్రాన్స్‌లో ఆయనకున్న దాదాపు 1.6 మిలియన్ యూరోల విలువైన ఆస్తులను శుక్రవారం స్వాధీనం చేసుకున్నది. ఈడీ చేసిన విజ్ఞప్తి మేరకు ఫ్రెంచ్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫ్రాన్స్‌లోని 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న విజయ్ మాల్యా ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ .14 కోట్లు.
Mon Jan 19, 2015 06:51 pm