హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదు అవుతోంది. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 8వ తరగతి వరకూ స్కూళ్లను మార్చి 31 వరకూ తెరవకూడదని నిర్ణయించింది. దీనికితోడు ఈ ఏడాది ఐదవ తరగతి, ఎనిమిదవ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. Click Here..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Dec,2020 06:54AM