హైదరాబాద్ : 2020 ఏడాది ఎందరికో విషాదం నింపుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా ప్రముఖలు మృతి చెందగా ఆరోగ్య కారణాలు, వయస్సు రీత్యా మరికొందరు నేతలు కన్నుమూసారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు(88) ఈ రోజు కన్నుమూశారు. కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించిన జనార్ధనరావు కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనార్ధనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం తరపున ప్రత్యేక శిక్షణకు పలు యూరప్ దేశాలకు పంపించడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తమమైన సేవలందించినందుకు జనార్ధనరావుకు పలు అవార్డులు లభించాయి.
జనార్ధనరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఉదయం 11.45 నిముషాలకు జరగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Dec,2020 09:40AM