హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. దాంతో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.46,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.50,290 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి 200 పెరిగి రూ.67,500 వద్ద నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm