హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికల్లో ఓటమితో నేతలు కృంగిపోతుంటే.. మరో పక్క సొంత పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రెడీగా ఉన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ ప్రచారంలో ఉంది. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో.. ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అది జానారెడ్డి సొంత నియోజకవర్గం. 2009, 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించిన జానారెడ్డి.. 2018లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం.. జానారెడ్డి బీజేపీలో చేరి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm