హైదరాబాద్ : బిగ్ బాస్ - 4 లో ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారం వారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. నామినేషన్ లో అవినాశ్, అఖిల్, అభిజీత్, మోనాల్, హారిక ఉన్నారు. ఈ వారం ఒకరు, వచ్చే వారం మరొకరు ఎలిమినేట్ కానుండగా చివరి వారం ఐదుగురు సభ్యులు మాత్రమే హౌజ్‌లో ఉంటారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. గతవారం ఎవిక్షన్ పాస్‌తో ఎలిమినేట్ కాకుండా బయటపడ్డ అవినాష్ ఈ వారం మాత్రం హౌజ్‌ని వీడక తప్పదు అని అంటున్నారు. సింపథీ గేమ్ అతని కొంప ముంచిందని కొందరు నెటిజన్స్ చెబుతున్నారు. దీంతో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అవినాశ్ అని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm