హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7వ తేదీన 2గంటలకు ప్రగతి భవన్లో అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సంవత్సరం రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదలపై ఈ సమావేశంలో సమీక్షంచి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
Mon Jan 19, 2015 06:51 pm