హైదరాబాద్: సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ హరితేజ త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెపుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆమె షూటింగులకు దూరంగా ఉంది. హరితేజ తొలుత సీరియల్స్ లో నటించింది. అనంతరం బుల్లితైరపై తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్యారక్టర్ నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బిగ్ బాస్ లో సైతం బుల్లితెర అభిమానులను అలరించింది. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm