బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న వి.కె.శశికళ విడుదల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వి.కె.శశికళ ఏ క్షణమైనా విడుదల కావచ్చిని వస్తున్న వార్తలకు కర్ణాటక హైకోర్టు బ్రేకులు వేసింది. శశకళ వర్గీయులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నేడు విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు దానిని కొట్టివేసింది. దీంతో ఆమె వర్గీయులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే శశికళ తను కట్టాల్సిన పది కోట్ల రూపాయల జరిమానా మొత్తాన్ని కూడా కట్టేసినట్టుగా వార్తలు వచ్చాయి. డీడీ రూపంలో చెల్లింపులు జరగడంతో.. శశికళ అతి త్వరలోనే విడుదల కానుందనే పుకార్లు కొన్ని రోజులుగా శికార్లు చేస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఆ పుకార్లకు బ్రేక్ పడినట్లు అయింది.
Mon Jan 19, 2015 06:51 pm