హైదరాబాద్: ఏఎఎంఐఎం పార్టీ అధినేత గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒవైసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ...గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు ఏ పార్టీతో చర్చించలేదన్నారు. మేయర్ ఎన్నికపై ఎవరైనా తనను సంప్రదిస్తే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. భవిష్యత్తులో జరగబోయే ప్రధాన ఎన్నికల్లో బీజేపీ అంత ప్రభావం చూపలేకపోవచ్చని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పై ప్రజలకు అభిమానం ఉందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలపై ఆ పార్టీ ఆలోచించుకోవాలన్నారు. బీజేపీతో ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm