నవతెలంగాణ భీమదేవరపల్లి
రాష్ట్రంలో రాక్షస పాలనలో ఇబ్బందులు, కోతల రాయుడు ఆటలు ఇక సాగనివ్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాక్షస పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండ వీరభద్ర స్వామిని ఆయన మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ముల్కనూర్ లో బండి సంజయ్ మాట్లాడారు కోతల రాయుడు, తుపాకి రాముడు ఆటలకు ఇక చెల్లె కాలం వస్తుందని ఆరోపించారు. దేశంలో ఇంత మూర్ఖపు దోపిడీ రాక్షస రజాకార్ల ముఖ్యమంత్రి లేదని మండిపడ్డారు. మూర్ఖపు ముఖ్యమంత్రి పాలనలో ఒక మంత్రికి ఒక అధికారికి సీఎంతో మాట్లాడే ధైర్యం లేదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాలన చేస్తూ కేంద్రాన్ని దుర్భాషలాడుతూ ఉన్న దౌర్భాగ్య ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే తమ కాంట్రాక్టర్లిచ్చే టెండర్లు వేయించుకుని ముడుపులు తీసుకుంటున్నారని అన్నారు. నాణ్యత లేని పనులు చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సంక్షేమంలో పెట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మండల అధ్యక్షుడు పృథ్వి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దొంగల కొమురయ్య, నాయకులు సాయి తేజ, సారయ్య వంశీ, సుధాకర్ రావు, సురేష్, సదానందం, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 12 Jan,2021 07:02PM