న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45కు పెరిగింది. అదేవిధంగా డీజిల్ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు చేరింది. ఈ పెంపుతో జైపూర్‌లో పెట్రో, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.91.85, డీజిల్ రూ.83.87గా ఉన్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.91.07కు చేరగా, డీజిల్ ధర రూ.81.34గా ఉన్నది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.87.85, డీజిల్ రూ.81.45కు చేరాయి.
Mon Jan 19, 2015 06:51 pm