హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో భూమి కంపించింది. ఈ సారి నగర నడిబొడ్డున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సిటీలోని కూకట్‌పల్లి అస్ బెస్టాస్ కాలనీలో భూమి స్వల్పంగా కంపించింది. ఈరోజు ఉదయం ఉదయం 9:25 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో భూమి కంపించిది. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. దీతో ఒక్కసారిగా వారంతా భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్లీ భూమి ఎక్కడ కంపిస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm