హైదరాబాద్: పండగవేళ ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 24మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే 12 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm