హైదరాబాద్: ప్రముఖ సింగర్ సునీత తాజాగా మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని రెండో పెండ్లీ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఎదిగిన పిల్లల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లి చేసుకొవడంతో నెటిజన్‌లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ట్వీట్ చేశారు. సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీటర్ వేదికగా సునీత-రామ్‌లకు ఆయన వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm