హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 203 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. గత 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. ఇప్పటి వరకు 8,75,921 మంది కోలుకోగా... 7,134 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,41,272 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm