హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజుల విచారణలో అఖిలప్రియ నుంచి కిడ్నాప్‌కు సంబంధించిన పలు విషయాలను పోలీసులు రాబట్టారు. పోలీసులు సంధించిన 300లకుపైగా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పినట్లు తెలిసింది. కిడ్నాప్ ప్లాన్ వివరాలన్నీ పోలీసులకు అఖిలప్రియ పూసగుచ్చినట్టు చెప్పిందని సమాచారం. విచారణలో అఖిలప్రియ చెప్పిన సమాచారంతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. యూసుఫ్‌గూడ, ఎంజీఎం స్కూల్, కూకట్‌పల్లి హోటళ్లలో పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm