మహబూబాబాద్: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న కుటుంబంకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు తమ సొంతవూరికి చేరువలో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం సంధ్య తండాకు చెందిన కుటుంబం సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు, లారీని తప్పించబోయి బురద పొలంలోకి దూసుకెళ్లింది.
Mon Jan 19, 2015 06:51 pm