ఢిల్లీ:: ఆగ్రా - ఢిల్లీ యమనా ఎక్స్‌ప్రెస్ హైవేపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న ఓ బస్‌ను మరో బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బాల్‌డియో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్ నోయిడా నుంచి ఆగ్రాకు వెళుతోంది. ఆగి ఉన్న బస్‌ను ఢీకొట్టుకోవడంతో ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు, స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో గురువారం దట్టమైన పొగమంచు కప్పివేసింది. తెల్లవారు జామున కనిష్ఠ ఉష్ణోగ్రత 3.2గా నమోదైంది. పలు చోట్ల 4.4డిగ్రీలకు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm