ఢిల్లీ: భారత జట్టులో గాయాల పర్వం కొనసాగుతూనేవుంది. నేడు గబ్బాలో జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. అతని గజ్జల్లో నొప్పి వస్తున్నట్లు బీసీసీఐ ఓ ట్వీట్‌లో పేర్కొన్నది. సైనీ తన 8వ ఓవర్‌లో తీవ్ర నొప్పితో ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో రోహిత్ శర్మ బౌలింగ్ వేశాడు. గాయపడ్డ సైనీని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తున్నది. బౌలింగ్ వేసేందుకు వచ్చిన రోహిత్.. మీడియం పేస్ బౌలింగ్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. సాధారణంగా స్పిన్ బౌలింగ్ వేసే రోహిత్.. సైనీ తరహాలో పేస్ బౌలింగ్‌కు ట్రై చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm