కరోనా నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు అన్ని పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరీక్షల నిర్వహణకు అధికారులు వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. తాజాగా నీట్ పిజి- 2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్ బి ఈ) తాజాగా ప్రకటన విడుదల చేసింది. నీట్ పిజి- 2021 పరీక్షను ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సారి ఈ ఎగ్జామ్ ను ఆన్ లైన్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఊహించని ఏదైనా పరిణామాలు ఏర్పడితే ఈ పరీక్ష తేదీలను మార్చే అవకాశం ఉంటుందని బోర్డు తెలిపింది.
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించబడిన సంస్థ నుంచి జారీ అయిన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎంసీఐ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థలు జూన్ 30, 2021లోపు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసి ఉండాలి. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 6,102 సంస్థల్లో 10,821(మాస్టర్ ఆఫ్ సర్జరీ-ఎంఎస్), 19,953 (డాక్టర్ ఆఫ్ మెడిసిన్-ఎండీ) సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి nbe.edu.in, natboard.edu.in వెబ్‌సైట్లను సందర్శించాలని బోర్డు సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 01:57PM