హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్డ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. అందులో 2018 మే 16 న గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్డ కాంట్రాక్టు ఉద్యోగులు పిఆర్సీ అమలు కోసం గత ముప్పది నెలలుగా ఎదురు చూస్తున్నారు. నివేదిక సమర్పించి పదిహేను రోజులు గడచినా పిఆర్సీ సిఫారసులను పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదు. ఇతర హామీల అమలుకు నిర్ధిష్ట ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈనెల6,7 తేదీల్లో సంఘాలతో చర్చలు జరపమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వచ్చిన వార్తలు అమలు జరగలేదు. రోజుకొక రకంగా మీడియాలో వస్తున్న వార్తలతో క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొంటున్నది.
ఈ నేపధ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్డ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఈరోజు(15.01.2021) పెన్షనర్స్ జెఎసి చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. పిఆర్సీ సత్వర అమలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 23న ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ ధర్నా చౌక్ నందు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టాలని, అదేరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మండల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించనైనది.
అప్పటికీ సమస్యల పరిష్కారం కాకుంటే ఫిబ్రవరి 15 లోపు రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కదిలించి ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. కనుక ఈ క్రింది సమస్యలను సత్వరమే పరిష్కరించి ఆందోళనను నివారించాలని కోరుతున్నాము.
డిమాండ్స్:
1. పిఆర్సీ నివేదికను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
2. ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో 1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలి.
3. 16 మే 2018 న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి.
4. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
5. సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలి. 1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తై తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.
పై డిమాండ్లు సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నాము.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 04:16PM