Not able to read behaviours of this leopard. Behaving strangely. People are not behaving better though. Videos circulating since evening. From HP. pic.twitter.com/5XNNkH4XLH
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 14, 2021
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని తీర్థన్ వ్యాలీ ప్రాంతంలో చిరుత రోడ్డు మీదకు వచ్చింది. అక్కడే గుంపుగా ఉన్న మనుషుల దగ్గరకు వెళ్లింది. ఇక చిరుత తమ దగ్గరకు రావడంతో.. వారంతా భయంతో పరుగు తీశారు. ఒక్క వ్యక్తి మాత్రం కదలకుండా అక్కడే ఉన్నాడు. ఇక చిరుతని చూసి జడుసుకుని దూరంగా పోయిన వారంతా అది.. సదరు వ్యక్తిపై దాడి చేస్తుందని భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. పెంపుడు కుక్కలగా చిరుత ఆ వ్యక్తితో ఆడటం ప్రారంభించింది. అతడి మీదకు ఎక్కి గారాలు పోయింది. ఇక చిరుత వింత వేషాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ దీన్ని తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఇది తెగ వైరలవుతోంది.