- దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ జవాన్ మరణించడం బాధాకరం
- జవాన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి
- మోతీలాల్ కుటుంబానికి అండగా ఉంటాం భగవంతుడు
- జవాన్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ కంటేశ్వర్
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందిన జవాన్ మోతీలాల్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహనిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశ భక్తితో,మాతృభూమి రక్షణకై సైన్యంలో చేరిన మోతీలాల్,నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరం అన్నారు.మోతీలాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి,అండగా ఉంటామని మంత్రి వేముల భరోసానిచ్చారు.మృతి చెందిన జవాన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు.నిజమాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ దెగవత్ మోతీలాల్ (25) డిసెంబర్ 28న సదాశివనగర్ మండలం దగ్గి వద్ద రోడ్డు ప్రమాదంలో మోతీలాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 11:53PM