హైదరాబాద్: టీకా వేసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నట్లు ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుండి ప్రారంభం కానున్న కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, అయితే వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు.
కొవిషీల్డ్
టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, అశాంతిగా అనిపించటం, జ్వరం, చలి, కీళ్ల నొప్పులు, కడుపులో వికారం.
కొవాగ్జిన్
టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, కడుపులో వికారం. వాంతులు, చమట పట్టడం, జలుబు, దగ్గు, చికాకు, వణుకు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 08:40AM