హైదరాబాద్: మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న టీకా పంపిణీ. తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లుచేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని, వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసానిస్తున్నారు. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టుగా భావించాలని చెప్పారు. ఎవరికైనా సమస్య తీవ్రమైతే చికిత్స చేసేందుకు 57 దవాఖానలు సిద్ధం చేశారు. టీకాలు ఎవరెవరికి వేయాలి, ఎవరికి వేయకూడదన్న దానిపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది.
జిల్లాల వారిగా
హైదరాబాద్ లో 13, మేడ్చల్ మల్కాజిగిరిలో 11, రంగారెడ్డిలో 9, ఖమ్మం, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నిజామాబాద్‌ల్లో 6 చొప్పున, వరంగల్ రూరల్, వనపర్తి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లలో 4 చొప్పున, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణఖేడ్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్‌లో 3 చొప్పున, ములుగు, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మెదక్, జగిత్యాల, జనగాం జిల్లాల్లో 2 టీకా కేంద్రాల చొప్పున ఏర్పాటుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 09:01AM