మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను రాష్ట్ర యువజన వ్యవహారాలు,క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. తొలుత పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు టీకా వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచదేశాలను వణికించిన మహమ్మారి కరోనా నివారణకు వ్యాక్సిన్ రావడం శుభపరిణామమని అన్నారు. కొవిడ్ ప్రారంభ కాలంలో దేశం నిర్మానుష్యమై పరిస్థితులు భయంకరంగా ఉండేవన్నారు. ప్రపంచదేశాలకు 40శాతానికి పైగా వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే సరఫరా కావడం గర్వకారణమన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో 4, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 4 చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 2, నారాయణపేటలో 3 వ్యాక్సికేషన్ కేంద్రాలున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm