హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనేటి నుండి దేశంలో ప్రారంభమైంది. సీరం సంస్థ తయారు చేసిన కోవీషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్‌లను అందిస్తున్నారు. కోవిన్ యాప్ ద్వారా పేరును నమోదు చేసుకోవాలి. మొదటగా, కరోనా వారియర్స్ కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. తొలివిడతలో మూడు కోట్ల మందికి, ఆ తరువాత 27 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించబోతున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్ పై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. దీనిపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ టీకా తీసుకున్న వ్యక్తుల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే, భారీ నష్టపరిహారం అందిస్తామని, వైద్యం అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఒప్పందపత్రంపై సంతకం కూడా చేసింది భారత్ బయోటెక్. ఒకవైపు మూడోదశ ప్రయోగాలు నిర్వహిస్తూనే, వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది.
Mon Jan 19, 2015 06:51 pm