హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కళాశాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాళోజీ హెల్త్ యూనివర్సిటీ. ఈ నెల 17, 18వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. గత విడత కౌన్సెలింగ్లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులుగ పరిగణించబడుతారు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm