హైదరాబాద్ : మల్లన్నసాగర్ ముంపు బాధితుడు తనకు పునరావస ప్యాకేజీ ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది ఆపి అతనిపై నీటిని పోసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి జిల్లాలోని కొండపాక మండలం సింగారానికి చెందిన మహమ్మద్ అజీజ్గా గుర్తించారు. అతనికి రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా ఇచ్చేశామని.. అతను 10 ఏళ్ల క్రితమే గజ్వేల్లో స్థిరపడడం వల్ల ప్రత్యేక ప్యాకేజీకి.. అతను అర్హుడు కాదని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 06:36PM