హైదరాబాద్ : దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజులో మరో ఇద్దరు.. యూకే స్ట్రెయిన్ బారినపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 116కు చేరింది. అయితే.. వైరస్ రోగులందర్నీ నిర్బంధంలో ఉంచినట్టు పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అంతేకాకుండా ఇటీవల రోగులను కలిసిన వారినీ క్వారంటైన్లో ఉంచడం సహా.. సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వైరస్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm