హైదరాబాద్ : సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లిన వాళ్లంతా తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. నిన్నటి నుంచే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీ కనిపించింది. ఇక నేడు అత్యధికులు హైదరాబాద్ కు వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం నర్సాపూర్, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల నుంచి స్పెషల్ రైళ్లు హైదరాబాద్ కు నడిపించనుంది.ఇక ప్రైవేటు ట్రావెల్స్ లో సైతం ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ల ధరను అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm