హైదరాబాద్: మలయాళ బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్, కేరళ నటి రజినీ చాందీ వార్తల్లో నిలిచారు. ఆమెపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అసభ్యకర కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా... ఆమె ఓ ఫొటోషూట్‌లో భాగంగా తీయించుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడమే అందుకు కారణం. రజినీ చాందీ(69)తో ఓ గ్లామరస్ ఫొటోషూట్ చేయాలని అథిర జాయ్ అనే ఫొటోగ్రాఫర్ భావించాడు. తనకు వచ్చిన ఆలోచనను ఆమెకు చెప్పడం, ఆమె కూడా అందుకు ఏ మాత్రం సంకోచించకుండా అంగీకరించడంతో ఫొటోషూట్ చేశాడు. 69 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంత ఫిట్‌నెస్‌తో ఉన్నారో తెలియజెప్పేందుకే ఈ ఫొటోషూట్ చేసినట్లు చెప్పాడు. అయితే.. ఈ గ్లామర్ ఫొటోలపై నెట్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ వయసులో ఇదేం బుద్దంటూ ఆమెను కొందరు తప్పుబడితే.. మరికొందరు మాత్రం అభ్యంతరకర కామెంట్స్ చేశారు. ఈ ఫొటోషూట్‌పై ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. వయసు పైబడిన వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకే తాను ఈ ఫొటోషూట్ చేసినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm