హైదరాబాద్ : వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాలను వెంటనే ఉపసంహరించుకునేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి కంపెనీలకు కేంద్రం కఠిన నింబంధనలు విధించేలా చూడాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) సుప్రీంకోర్టును కోరింది.
భారతదేశంలో వాట్సాప్ కార్యకలాపాలకు కేంద్రం అనుమతినిచ్చిందని.. అయితే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో విఫలమైందని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్రం తన రాజ్యాంగ విధిని నిర్వర్తించేందుకు ఈ వ్యాజ్యం అత్యవసరమని భావిస్తున్నట్టు న్యాయవాది వివేక్ నారాయణ్ శర్మ తెలిపారు.
పార్లమెంటు సభ్యులు, మంత్రులు, న్యాయమూర్తులు, రక్షణ సిబ్బంది సహా.. కోట్ల మంది వ్యాపారులు ఉపయోగిస్తున్న వాట్సాప్ గోప్యతా విధానాలపై రాజీ పడటం.. జాతీయ భద్రతను ప్రమాదంలో పడేయడమేనని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. 2017లో యూరోపియన్ యూనియన్ దేశాల్లో, అంతకముందు జర్మనీలో వాట్సాప్ నూతన విధానాల అమలును తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని వ్యాజ్యంలో గుర్తు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2021 09:42AM