హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకుని చైన్ స్నాచింగ్ చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన గొల్లపల్లి రామకృష్ణ(37).. గతంలో సాఫ్ట్వేర్గా పనిచేశాడు. ఉద్యోగం పోగొట్టుకున్న అతను జల్సాలకు బానిసై డబ్బుల కోసం బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ నెల 7న అశోక్నగర్లో పండ్లు కొనుగోలు చేస్తున్న మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసును రామకృష్ణ అపహరించి పారిపోయాడు. అనంతరం బాధితురాలు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. రామకృష్ణ నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm