హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కుంట్లూర్లో కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ అదుపుతప్పిన కారు... రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంటి గోడ కూలిపోయింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm