ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బీఎస్6 మోడల్ కార్లపై అత్యధికంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. దాదాపు అన్ని రకాల కార్లకు ఈ డిస్కౌంట్‌లు వర్తించనున్నాయి. అయితే, ఈ డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఇతర ఆఫర్లు కూడా కలిపి ఉంటాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. మహీంద్రా సంస్థ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఆల్టురస్ జీ4 మోడల్‌పై అత్యధికంగా రూ.2.20 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేలు ఎక్స్‌ఛేంజి బోనస్, రూ.16 వేలు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20 వేల ఇతర బెనెఫిట్‌లు లభిస్తాయి. స్కార్పియోపై రూ.39,502 వరకు డిస్కౌంట్ వస్తుంది. అందులో రూ.10,002 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజీ ఆఫర్, రూ.4,500 కార్పొరేట్ డిస్కౌంట్, అదనపు ఆఫర్ల కింద మరో రూ.10వేలు ఇవ్వనున్నారు. కేయూవీ 100 నెక్స్ట్‌పై రూ.62,055 డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్‌యూవీ 500పై రూ.59 వేల డిస్కౌంట్ లభిస్తుంది. మర్రాజో ఎంపీవీపై రూ.36 వేలు, బొలేరోపై రూ.24 వేల తగ్గింపులు వర్తిస్తాయి.
Mon Jan 19, 2015 06:51 pm