న్యూఢిల్లీ: మనం ఫోన్ చేయగానే.. ‘‘నమస్కారం’’ అంటూ మనకు కొవిడ్-19 జాగ్రత్తలు చెప్పే కరోనా కాలర్ టోన్ మళ్లీ మారింది. శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా ఈ కాలర్ టోన్ కూడా మారిపోయింది. ఇప్పటి వరకూ లాక్‌డౌన్ నిబంధనలు తొలగించినా కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పిన ఈ ట్యూన్.. ఇకపై భారత్ తయారు చేసిన వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తోంది. ‘‘కొత్త సంవత్సరం వ్యాక్సిన్ రూపంలో కొత్త ఆశల కిరణాలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ కరోనా జాగ్రత్తలన్నీ హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గొంతులో వినిపించేవి. అయితే ఈ కొత్త సూచనలు మాత్రం ఓ మహిళ స్వరంలో వినిపించనున్నాయి. కాగా, అమితాబ్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా కరోనా సోకడంతో.. కరోనా ట్యూన్‌లో అమితాబ్ స్వరం తొలగించాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm