హైదరాబాద్: వాట్సప్ ఓపెన్ చేసిన ప్రతీసారి స్టేటస్ చెక్ చేయడం చాలామందికి అలవాటు. అలా అలవాటుగా ఈరోజు స్టేటస్ చూడగానే యూజర్లు ఆశ్చర్యపోయారు. అందుకు కారణం స్టేటస్ లిస్ట్‌లో తమ కాంటాక్ట్స్‌లో ఉన్నవారివి కాకుండా వాట్సప్ నుంచి ఓ స్టేటస్ అప్‌డేట్ వచ్చింది. వాట్సప్ స్టేటస్‌లో వాట్సప్ నుంచి వచ్చిన స్టేటస్ చూసి ఆశ్చర్యపోయారు. మొత్తం నాలుగు స్లైడ్స్‌తో ఈ స్టేటస్ అప్‌డేట్ వచ్చింది. అందులో యూజర్ల ప్రైవసీపై క్లారిటీ ఇచ్చింది. జనవరి 5న వాట్సప్ ప్రైవసీ పాలసీ అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 లోగా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేకపోతే వాట్సప్ ఉపయోగించడం సాధ్యం కాదని డెడ్‌లైన్ విధించింది. అందులో ఉన్న అంశాలు యూజర్లను కలవరపర్చాయి. వాట్సప్ యూజర్ల మొత్తం సమాచారాన్ని అంటే యూజర్లు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకోవడంతో పాటు, ఫేస్‌బుక్‌తో కలిసి బిజినెస్ చేస్తున్న వారితోనూ పంచుకుంటామన్నది కొత్త యూజర్ ప్రైవసీ పాలసీ సారాంశం.
ఈ ప్రైవసీ పాలసీ అప్‌డేట్ యూజర్ల ఆగ్రహానికి కారణమైంది. తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. వాట్సప్‌ని డిలిట్ చేయాలన్న నినాదం మొదలైంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. వాట్సప్‌ని వదిలేసి ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్స్ వాడాలని యూజర్లు నిర్ణయించుకున్నారు. దీంతో టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్స్‌కి డిమాండ్ పెరిగింది. డౌన్‌లోడ్స్ కూడా పెరిగాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ లాంటివాళ్లంతా సిగ్నల్ యాప్‌ను ఉపయోగించాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. దీంతో వాట్సప్ నుంచి ఇతర యాప్స్‌కి వెళ్లేవారి సంఖ్య పెరిగింది. దీంతో వాట్సప్ డౌన్‌లోడ్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఇతర మెసేజింగ్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసేవారు పెరిగారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరిస్తితి ఇలా చేయిదాటిపోతుండటంతో డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది వాట్సప్. యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు లేదని యాడ్స్ ఇచ్చింది. ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌ను ఫిబ్రవరి 8 నుంచి మే 15 కు వాయిదా వేసింది. అయినా యూజర్ల నమ్మకాన్ని పొందలేకపోతోంది. అందుకే మీ ప్రైవసీకి ఎలాంటి ఢోకా లేదంటూ నాలుగు స్లైడ్ల స్టేటస్ అప్‌డేట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది వాట్సప్. ప్రైవసీ విషయంలో కట్టుబడి ఉన్నామని మొదటి స్లైడ్‌లో, వాట్సప్ ఛాట్స్‌కి ఎండ్ టు ఎండ్ ఇన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి వాటిని తాము చదవలేమని, వినలేమని రెండో స్లైడ్‌లో, మీరు షేర్ చేసిన లొకేషన్‌ను చూడలేమని మూడో స్లైడ్‌లో, మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోమని నాలుగో స్లైడ్‌లో వివరించింది వాట్సప్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2021 05:25PM