హైదరాబాద్: ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులు మాయం కావడం తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రులు ఆదమరచి ఉన్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు పసిపిల్లలను ఎత్తుకెళ్లిపోతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తమకు పిల్లలను పుట్టలేదని కొందరు., పసిపిల్లల్ని విక్రయించి సొమ్ము చేసుకోవడానికి కొందరు ఆస్పత్రుల్లో పిల్లల్ని మాయం చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఏకంగా తన కడుపులో బిడ్డ మాయమయ్యాడంటూ ఆందోళనకు దిగింది. డెలివరీ కోసం వస్తే డాక్టర్లే తనను మోసం చేసి బిడ్డను మాయం చేశారని ఆరోపించింది. అంతేకాదు తనకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగింది. తన బిడ్డను తెచ్చి ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చుంది. ఈ హఠాత్పరిణామంతో డాక్టర్లు షాకయ్యారు.
వివరాల్లోకి వెళితే.., నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం, మంగా నెల్లూరు గ్రామానికి చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. పలుసార్లు చికిత్స కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి ఆ మహిళ వచ్చింది. రాత్రి బాగానే ఉన్న మహిళ ఉదయానికి తన కడపులో బిడ్డ మాయమయ్యాడని డాక్టర్లతో వాగ్వాదానికి దిగింది. తాను కాన్పు కోసం వస్తే డాక్టర్లు మత్తు ఇచ్చి తన బిడ్డను మయం చేసిన డాక్టర్లు, అతను గర్భమే రాలేదని అబద్ధాలాడుతున్నట్ల శశికళ ఆరోపిస్తోంది. దీంతో ఒక్కసారి షాక్ కు గురైన డాక్టర్లు విషయాన్ని అలిపిరి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కడుపులో ఏర్పడిన బుడగలను గర్భంగా పొరబడిందని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు శశికళ మాత్రం తాను ఈనెల 5న ఆస్పత్రికి రాగా.. ఈనెల 16న డెలివరీ డేట్ ఇచ్చారని తెలిపింది. అదివారం సాయంత్రం ఆస్పత్రికి రాగా.. ఇంజెక్షన్లు, సిలైన్లు ఇచ్చారని, ఆ తర్వాత తనకేం తెలియదని చెప్పింది. ఉదయానికి తాను గర్భవతిని కాదని డాక్టర్లు చెప్పినట్లు ఆరోపించింది. 9నెలల గర్భంతో ఆస్పత్రికి వచ్చానని, డాక్టర్లే అబద్ధాలాడుతున్నట్లు చెప్పింది. గతంలో నెల్లూరు జిల్లా గూడురులోని మైథిలి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాని.. అక్కడ కూడా తాను గర్భం దాల్చినట్లు చెప్పారంది. అంతేకాదు ఇటీవలే శీమంతం జరిగినట్లు ఫోటోలు కూడా చూపించింది. ఐతే మైథిలీ ఆస్పత్రి డాక్టర్లు మాత్రం శశికళకు గర్భం రాలేదని చెప్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో పలుసార్లు ఆస్పత్రికి వచ్చిందని చెప్పారు. ఐతే ఆమెకు గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో మందులు, ఇంజెక్షన్లతో ట్రీట్ మెంట్ ఇస్తున్నాన్నారు. మరి ఆమె తిరుపతిలో ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదన్నారు. రుయా ఆస్పత్రి డాక్టర్లు కూడా ఆమె ఇక్కడ అడ్మిట్ కాలేదని., ఇక్కడ డెలివరీ కాలేదని చెప్తున్నారు. ఆస్పత్రి రిజిస్టర్లో కూడా ఆమె గర్భవతి అనే సంగతి లేదన్నారు. గతంలో తీయించిన స్కానింగ్ ప్రకారం కడపులో నీటి బుడగలు ఉన్నట్లుగా తేలిందన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రుయాలో కాకుండా మరో ఆస్పత్రిలో టెస్టులు చేయిస్తామని..,డాక్టర్లు చెప్పిన దానిని బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2021 06:41PM