పూంచ్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టారు నియంత్రణ రేఖ వద్ద ఆదివారం రాత్రి పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు ఆదివారం రాత్రి పదిన్నర గంటలకు షెల్లింగులు, మోర్టార్లతో కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు పాక్ సైనికులపై ఎదురుకాల్పులు జరిపారు. పాక్ సైనికుల దాడిని భారత సైన్యం సమర్ధంగా తిప్పి కొట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm