సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ రన్‌లో భాగంగా సోమవారం జిల్లాలో నిర్వహించిన 2కే రన్‌ను మంత్రి హరీష్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ముస్తాబాద్ చౌరస్తా 2కే రన్ కొనసాగనుంది. ఈ రన్‌లో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. స్వచ్ఛ రన్‌లో పాల్గొందాం దేశానికి మన ఐక్యతను చాటి చెబుదామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm