హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నది. నేటినుంచి 324 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శనివారం (జనవరి 16న) కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలిరోజు 140 కేంద్రాల్లో మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేశారు. ప్రతి కేంద్రంలో 30 మందికి టీకా పంపిణీ చేశారు. ఇవాళ అదనంగా 184 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. దీంతో జిల్లాల్లో వ్యాక్సినేషన్ సెంటర్ల సంఖ్యను పెంచారు. ప్రతి కేంద్రంలో 50 మంది చొప్పున టీకాలు వేయనున్నారు. హైదరాబాద్‌లో 42 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm