హైదరాబాద్ : భారత మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. టీవీలో మ్యాచ్ చూస్తుండగా అకస్మాత్తుగా ఆయాసం రావడం, మాట తడబడటంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్టు ఆయన భార్య సంధ్య చెప్పారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ సోమవారంనాడు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, రెండు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని చెప్పారు. లెజెండ్రీ లెగ్ స్పినర్ చంద్రశేఖర్ 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. యావరేజ్ రన్ రేటు 29.74 శాతంగా ఉంది. 1961 జనవరిలో ఆయన క్రెకెట్ టీమ్‌లోకి అడుగుపెట్టి 1979లో చివరి మ్యాచ్ ఆడారు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడారు. ఆ మ్యాచ్‌లో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm